ఇంద్రజిత్తు రామ లక్ష్మణులపై నాగాస్త్రం ప్రయోగించుట

రాముడు లంకా ప్రాసాదం సమీ పానికి వచ్చి, లోపల ఉన్న సీతను తలుచు కుని, లంక పై దాడి ప్రారంభించమని వానరులకు ఆజ్ఞ ఇచ్చాడు. యుద్ధానికి సిద్ధంగా, చెట్లూ రాళ్ళూ పట్టుకుని ఉన్న వానరులు, రావణుడు చూస్తుండగానే, గుంపులు గుంపులుగా ప్రాకారం ఎక్కారు. వారు ప్రాకారాలనూ, పురద్వారాలనూ నాశనం చేశారు, అగడ్తలను పూడ్చారు.

రావణుడు కూడా రాక్షసులను యుద్ధానికి ఉపక్రమించమని ఆదేశించాడు. సింహ నాదాలతోనూ, భేరీ భాంకారాలతోనూ, శంఖు ధ్వానాలతోనూ వానర రాక్షసుల మధ్య యుద్ధం ప్రారంభ మయింది.

ఇంద్రజిత్తు అంగదుడితోనూ, జంబు మాలి హనుమంతుడితోనూ, తపనుడనే రాక్షసుడు గజుడితోనూ, నికుంభుడు నీలుడి తోనూ ద్వంద్వ యుద్ధాలు చేశారు. ఇదే విధంగా అనేకమంది రాక్షస వీరులకూ, వానర వీరులకూ మధ్య ద్వంద్వ యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలలో సంపాతి అనే విభీషణ మంత్రి ప్రజంఘుడనే రాక్షసుణ్ణి చంపాడు. అలాగే ప్రఘనుడు సుగ్రీవుడి చేతిలో చచ్చాడు. విద్యున్మాలిని సుషేణు డనే వానరవీరుడు చంపాడు.

ఇంతలో సూర్యుడస్తమించాడు. రాత్రి వచ్చింది. కాని ఉభయపక్షాలూ విజయ కాంక్షతో యుద్ధం కొనసాగించాయి.

ఆ రాత్రి వానరులకూ రాక్షసులకూ ఘోరమైన యుద్ధం జరిగింది. రక్తం నదులుకట్టి పారింది. ఉత్తర ద్వారాన్ని రక్షించే యమశత్రుడూ, మహాపార్శ్వుడూ, మహెూధరుడూ, మహాకాయుడూ, వజ్రదంష్ట్రుడూ, శుకసారణులూ రాముడి పైకి యుద్ధానికి వెళ్ళి, తీవ్రమైన రాముడి బాణాలచే కొట్టబడి, పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు.

ఇంకెందరో రాక్షసులు రాముడి చేతిలో చచ్చారు. అసలే భయంకరంగా ఉన్న ఆ రాత్రి సింహనాదాలతోనూ, ప్రతిధ్వనులు తోనూ మరింత భయంకరమయింది.

అంగదుడికి ఇంద్రజిత్తుకూ జరిగిన ద్వంద్వ యుద్ధంలో అంగదుడు ఇంద్రజిత్తు సారధిని, గుర్రాలనూ చంపాడు. ఇంద్రజిత్తు అంతర్ధాన మయాడు. అతను మాయా యుద్ధానికి పూనుకుని, వానరసేనపై పిడు గుల వంటి బాణాలు వేశాడు, రామలక్ష్మణు లిద్దరి పైనా నాగాస్త్రాలు వేసి వారిని బంధిం చాడు, వారి శరీరాలనిండా సందు లేకుండా బాణాలు కొట్టాడు.

అతను వారితో, “రామ లక్ష్మణులారా, నేను అదృశ్యంగా ఉండి యుద్ధం చేస్తుంటే ‘ఇంద్రుడు కూడా నన్ను తెలుసుకో లేడు, సమీపించలేడు. మీ రెంత? మిమ్మల్ని ఇప్పుడే యముడి వద్ద కు పంపేస్తాను.” అంటూ సింహనాదాలు చేశాడు. రామ లక్ష్మణులు నేలపై పడిపోయి ఏమీ చెయ్య లేని స్థితిలో ఉండి పోయారు. రాముళ్ళు చూసి లక్ష్మణుడికి ప్రాణభయం కలిగింది. హనుమంతుడు మొదలైన వానరులు కూడా అధైర్య పడిపోయారు. వారాకాశ మంతా కలయ జూసినా ఇంద్రజిత్తు కనిపించలేదు.

ఇంద్రజిత్తు రామ లక్ష్మణులనిద్దరినీ తాను చంపినట్టే భావించుకుని, వారు చచ్చారు చూడమని రాక్షసులకు చెప్పి, లంకలోకి తిరిగి వెళ్ళి పోయాడు.

రామ లక్ష్మణులను చూస్తున్న కొద్దీ సుగ్రీవుడికి భయము, దుఃఖమూ పుట్టు కొచ్చాయి. విభీషణుడతనితో, “దుఃఖించకు. యుద్ధమంటే ఇలాగే ఉంటుంది. మొదటి నుంచి చివరదాకా జయమే కలగాలంటే కలుగుతుందా? అదృష్టం బాగుంటే రామలక్ష్మణులకు తిరిగి స్పృహ రావచ్చు.” అంటూ నీటితో సుగ్రీవుడి అశ్రువులు కడిగాడు.

విభీషణుడు సుగ్రీవుడికి ధైర్యం చెప్పి, భయపడి పారిపోయే ప్రయత్నంలో ఉన్న వానరులకు ఉత్సాహం కలిగిస్తూ, సైన్యం నలుదిక్కులా తిరిగాడు. విభీషణుడి ప్రోత్సాహ వచనాలు వానరుల పై బాగా పని చేశాయి.

ఇంద్రజిత్తు తిన్నగా రావణుడి సభకు వెళ్ళి, తండ్రికి నమస్కారం చేసి, ” రామ లక్ష్మణులను చంపేశాను,” అని చెప్పాడు. రావణుడు పరమ సంతోషంతో ఆసనం మీది నుంచి లేచి, కొడుకును కౌగిలించు కున్నాడు. ఇంద్రజిత్తు యుద్ధ క్రమమంతా చెప్పాడు. అతన్ని తండ్రి ప్రశంసించాడు.

అతను సీతకు కాపలా ఉన్న త్రిజట మొదలైన రాక్షస స్త్రీలను పిలిపించి, “ఇంద్రజిత్తు చేతిలో రామ లక్ష్మణులు చచ్చారు. సీత మదమణిగింది. ఆమె ఇక సర్వాభరణాలు ధరించి, నా దగ్గిరికి వచ్చేస్తుంది. ఆ సీతను పుష్పక విమానంలో ఎక్కించి, యుద్ధరంగానికి తీసుకుపోయి, పడి ఉన్న రామ లక్ష్మణులను చూపించండి,” అని ఆజ్ఞాపించాడు.

వాళ్ళు పుష్పకం ఉన్న చోటికి వెళ్ళి, దాన్ని తీసుకుని అశోకవనానికి పోయి, అందులో సీత నెక్కించుకుని యుద్ధరంగా నికి తీసుకు పోయారు. అక్కడ సీతకు పడి ఉన్న రామ లక్ష్మణులూ, వారి చుట్టూ కూర్చుని, ఏ మాత్రం అలికిడి వినిపించినా రాక్షసులు వచ్చి పడుతున్నారేమో నని భయపడుతున్న వానర ప్రముఖులూ కనిపించారు. ఆమె దుఃఖ సముద్రంలో ముణిగి పోయింది.

సాముద్రిక వేత్తలూ, జ్యోతిశ్శాస్త్రం తెలిసినవారూ కూడా తనకు వైధవ్యం ఉండదన్నారు; తాను పుత్రవతి అవుతుందన్నారు. మహారాణి అవుతుందన్నారు. తనకు మహా వీరుడు భర్త అవుతా డన్నారు. గోప్పాద మంత ఇంద్రజిత్తు మాటలన్నీ అబద్ధం చేసేశాడు. రామ లక్ష్మణులకు తెలిసిన దివ్యాస్త్రాలన్నీ ఏమయాయో? వాళ్ళు తన కోసం నాలుగు దిక్కులా వెతికించి, పెద్ద సేనతో సముద్రాన్ని కూడా దాటి లంకను చేరింది ఇంద్రజిత్తు మాయకు బలికావనికా? పద్నాలు గేళ్ళూ పూర్తి కాగానే తన కొడుకు సీతా లక్ష్మణులతో తిరిగి వస్తాడని ఎదురు చూసే కౌసల్య ఏంకాను?

ఈ విధంగా దుఃఖంతో కుములుతున్న సీతను చూసి, “అమ్మా, ఏడవకు. రామ లక్ష్మణులు చావలేదు. వారు చచ్చినలక్షణా లేవీ కనిపించవు,” అన్నది త్రిజట. సీత ఆ మాట విని చేతులు జోడించి, “తథాస్తు!”. అని పలికింది.

తరవాత పుష్పకం తిరిగి వెళ్ళిపోయింది. సీత మళ్ళి అశోకవనం ప్రవేశించి, రామ లక్ష్మణులను పదే పదే తలుచుకుంటూ కన్నీరు కార్చింది.

యుద్ధరంగాన కొంత సేపటికి రాముడికి స్పృహ వచ్చింది. అతను తన పక్కన పడి ఉన్న లక్ష్మణుణ్ణి చూసి అతను చనిపోయా డనుకుని నిరాశచెందాడు. లక్ష్మణుడితో బాటు తాను కూడా చావాలని నిశ్చయించు కున్నాడు. సీతవంటి భార్య వెతికితే దొరక్క పోదు, లక్ష్మణుడి వంటి తమ్ము డెక్కడ దొరుకుతాడు? లక్ష్మణుడు లేకుండా యుద్ధమెందుకు, అందులో విజయ మెందుకు ? తాను ఒంటరిగా అయోధ్యకు తిరిగి పోయి సుమిత్ర ఎదట పడగలడా ? అసంభవం.

తాను విభీషణుణ్ణి లంకకు రాజుగా చెయ్యలేక పోయినందుకు రాముడు చాలా చింతించాడు. తన కోసం సుగ్రీవుడు మొద లైన వానర యోధులు పడిన శ్రమకు కృతజ్ఞత చెప్పుకుని,. వారు ప్రదర్శించిన శౌర్య పరాక్రమాలను మెచ్చుకుని, అందరినీ తిరిగి వెళ్ళి పొమ్మన్నాడు.

ఇంతలో విభీషణుడు తన గదతో సహా సుగ్రీవుడున్న చోటికి వచ్చాడు. అతన్ని దూరానే చూసి, ఇంద్రజిత్తు వస్తున్నా డను . “కుని వానరులు భయపడి పారిపోసాగారు. జాంబవంతుడు వెళ్ళి వాళ్ళ భయాన్ని పోగొట్టాడు. వచ్చిన వాడు విభీషణుడని చెప్పిన మీదట, పారిపోతున్న వానరులు తిరిగి వచ్చారు.

సుగ్రీవుడు తన సమీపంలో ఉన్న తన మామ సుశేణుడితో, “రామ లక్ష్మణులకు స్పృహ రాగానే వాళ్ళను తీసుకుని, కొందరు వానర వీరులతో సహా కిష్కింధకు వెళ్ళు. నేను ఈ రావణుణ్ణి చంపి సీతను తీసుకు వస్తాను,” అన్నాడు.

“పూర్వం దేవాసురులకు యుద్ధం జరిగి నప్పుడు అనేకమంది దేవతలు మూర్ఛ పోయారు, కొందరు చచ్చిపోయారు కూడా. అప్పుడు బృహస్పతి మృతసంజీవని లాంటి విద్యల సహాయంతోనూ, మూలికల సహా యంతోనూ వాళ్ళకు చికిత్స చేశాడు. క్షీర సముద్ర మధనం జరిగిన చోట చంద్ర, ద్రోణ పర్వతాలున్నాయి. వాటి పైన దేవతలు సంజీవకరణి, విశల్యకరణీ అనే ఓషధులను పెంచారు. హనుమంతుణ్ణి అక్కడికి పంపించి, వాటిని తెప్పించు,” అన్నాడు సుషేణుడు

ఇంతలో పెనుగాలి వీచింది. ఆ గాలి తాకిడికి మేఘాలు దూదిపింజెల్లాగా కొట్టుకు పోయాయి, సముద్రంలో పెద్ద కెరటాలు పుట్టాయి. మరి కొంత సేపటికీ గరుత్మంతు డక్కడికి వచ్చాడు. అతణ్ణి చూస్తూనే రామ లక్ష్మణులను బాణాల రూపంలో బంధించిన పాములు పారిపోయాయి. తరువాత అతను తన చేతులతో వారిద్దరి ముఖాలూ తడివాడు. వెంటనే వారి గాయాలన్నీ నయమై, శరీరాలకు ఎప్పటి శక్తి, తేజస్సూ సమకూరాయి. అతడు వారిని లేవనెత్తి ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడు.

రాముడు అతనితో, “అయ్యా, నిన్ను చూస్తే నాకు మా తండ్రినో, తాతనో చూసి నంత ఆనందం కలుగుతున్నది. దివ్య లేపనాలూ, దివ్యాంబరాభరణాలు ధరించి ఉన్నావు. నీ వెవరు?” అని అడిగాడు.

“నేను నీకు స్నేహితుణ్ణు. నా పేరు.. గరుత్మంతుడు: మిమ్మల్ని బంధించిన పాములు కద్రువ సంతానం. ఇంద్రజిత్తు తన మాయ చేత వాటికి బాణ రూపం ఇచ్చి మీపై ప్రయోగించాడు. ఈ వార్త తెలిసి నేనిక్కడికి వచ్చాను. నేను నీకు ఎలా స్నేహితుణ్ణి యుద్ధంలో నీకు జయం కలిగాక చెబుతాను. రాక్షసులు మహామాయావులు. జాగ్రత్తగా వారితో యుద్ధం చెయ్యి. నీకు జయం కలుగుతుంది,” అని గరుత్మంతుడు రాముడి వద్ద శలవు తీసుకున్నాడు.

వానరులకు ఉత్సాహం తిరిగి వచ్చింది. వారు భేరులు మోగించి, శంఖాలు పూరించి, సింహనాదాలు చేశారు. లంకలో రావణుడికి ఆ ధ్వని వినిపించింది. రామలక్ష్మణులు చచ్చి ఏడుస్తూ ఉండవలిసిన వానరులు ఉత్సాహంతో శంఖాలూ, భేరీలూ ఎందుకు మోగిస్తున్నారో కనుక్కు రమ్మని అతను కావలివాళ్ళను పంపాడు. వాళ్ళు ప్రాకారాలపై కెక్కి, వానరసేన అంతా కలయజూన్, రావణుడి దగ్గరికి వచ్చి, రామ లక్ష్మణులు బంధవిముక్తులై సుఖంగా ఉన్నారని చెప్పారు.

ఇది విని రావణుడు తెల్లబోయి, “ఇంద్ర జిత్తు ప్రయోగించిన నాగబంధాలను విప్పటం దేవతలకైనా సాధ్యంకాదు. రామ లక్ష్మణులు వాటి నుండి బయటపడటం రాక్షస సేనకు అపాయాన్ని సూచిస్తున్నది,” అన్నాడు. అతను ధూమ్రాకుడనే వాణ్ణి పిలిచి, “సేనతో సహా వెళ్ళి రాముణ్ణి వధించిరా !” అని ఆజ్ఞాపించాడు.

ధూమ్రాక్షుడు ఒక పెద్ద సేన తీసుకుని, తోడేలు ముఖాలూ, సింహం ముఖాలూ గల గాడిదలను పూన్చిన రథ మెక్కి యుద్ధానికి బయలుదేరాడు. రాక్షసులకూ, వానరులకూ గొప్ప యుద్ధం జరిగింది. ఉభయపక్షాలా అపారమైన ప్రాణ నాశం జరిగింది. చిట్టచివరకు వానరుల దెబ్బకు తట్టుకోలేక రాక్షసులు పారిపోసాగారు. ఇది చూసి ధూమ్రాక్షుడు వానర సేనపై విజృంభించాడు. హనుమంతుడికి కోపం వచ్చి, పెద్ద శిలను తీసుకు వచ్చి, ధూమ్రాక్షుడి రథంపై వేశాడు. రథం నుగ్గయింది గాని ధూమ్రాక్షుడు గదతో సహా కిందికి దూకేశాడు. హనుమంతుడికీ, అతనికి యుద్ధమయింది. ధూమ్రాక్షుడు తన గదను హనుమంతుడి తలపైకి విసిరాడు. దాని దెబ్బకు హనుమంతుడు చలించక, ధూమ్రాక్షుడి నెత్తిన పర్వత శిఖరాన్ని వేసి చంపేశాడు. వానరులు హనుమంతుణ్ణి మెచ్చుకున్నారు.

ధూమ్రాకుడు చచ్చాడని విని రావణుడు వజ్రదంష్ట్రుణ్ణి సేనతో సహా పంపాడు. ఆ సేన లంక యొక్క దక్షిణ ద్వారం కుండా వెళ్ళింది. ఆ ద్వారం వద్ద అంగదు డున్నాడు. ఉభయపకాల మధ్యా దొమ్మి యుద్ధం, ద్వంద్వ యుద్ధాలు జరిగాయి.

యుద్ధంలో వానరులు నష్టమవుతూ ఉండటం చూసి మండిపడి, అంగదుడు విజృంభించి రాక్షసుల తలలు పగలగొట్ట నారంభించాడు. రాక్షసులా తాకిడికి తట్టుకో లేక చలించిపోయారు. తన పక్షం దెబ్బ తింటూండటం చూసి వజ్రదంష్ట్రుడు అంగ దుడితో తలపడ్డాడు. ఇద్దరికీ చాలాసేపు యుద్ధం జరిగిన మీదట అంగదుడు కత్తితో వజ్రదంష్ట్రుడి తల తెగవేశాడు. రాక్షసులంతా లంకా నగరంలోకి పారిపోయారు.

ఈసారి రావణుడు అకంపను డనే రాక్షస సేనానిని పంపాడు. రాక్షస వానర పక్షాలు రెండూ విజయ కాంక్షతో పట్టుదలగా యుద్ధం చేశాయి. కుముదుడూ, నలుడూ, మైందుడూ, ద్వివిదుడూ అనే వానరవీరులు ఒక్కసారిగా రాక్షస సేనపైన పడి రాక్షసులను గుంపులు గుంపులుగా వధించసాగారు.

ఇది గమనించి అకంపనుడు తన రథాన్ని ఆ వానర వీరులున్న చోటికి తోలించాడు. అతని బాణాల తాకిడికి వానర వీరులు తట్టుకో లేకపోయారు. అకంపనుడి చేతిలో చావటానికి సిద్ధంగా ఉన్న వానరులకు అండగా హనుమంతుడు వచ్చాడు.

అతను అకంపనుడి బాణాలను లక్ష్య పెట్టకుండా, ఆయుధంగా ఒక కొండను పెరికి, ఒంటి చేత పట్టి గిరగిరా తిప్పి, అకంపనుడి పైకి వెళ్ళాడు. అకంపనుడు తన బాణాలతో ఆ కొండ శిఖరాన్ని ముక్కలు ముక్కలు చేసేశాడు. హనుమంతుడు మండి పడి, ఒక పెద్ద చెట్టు పెరికి, దానితో అకంప నుడి తల చితకగొట్టి చంపేశాడు. వానరులు పరమోత్సాహంతో సింహనాదాలు చేస్తూంటే, రాక్షసులు తమ ఆయుధాలు కూడా పారేసి పారిపోయారు.

Leave a Reply