అన్నదమ్ములు

అనగా అనగా ఒక ఊర్లో రామయ్య, సోమయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. రామయ్య పెద్దవాడు, తెలివిగలవాడు. సోమయ్య చిన్నవాడు, అమాయకుడు. రామయ్య భార్య భాగ్య, పంతుల గారి బిడ్డ. అందుచేత గర్వంగా ఉండేది. సోమయ్య భార్య బీయింటి పిల్ల, అందుచేత కొంచెం అణకువగా ఉండేది.

రామయ్య తన తెలివితేటలతో తమ్ముడి ఆస్తి అంతా తనకు కాజేసి, తాతలనాటి చిన్న పాత ఇల్లు, నాలుగు ఎకరాల మెట్ట చేను మాత్రం సోమయ్యకు ఇచ్చాడు. రామయ్య తనకు పెద్ద మేడ, మిగతా ఆస్తి అన్నిటినీ ఉంచుకున్నాడు. పాపం సోమయ్య, దాంతో సంతోషంగా, కష్టపడి చేను దున్నుతూ, తనకు కొంత తిని, మిగతాది ధర్మం చేస్తూ జీవించేవాడు.

ఒకనాటి రాత్రి ఒక సన్యాసి రామయ్య ఇంటి ముందు వచ్చి తలుపు తట్టాడు. రామయ్య వచ్చి కిటికీ తెరిచి, “ఎవరు నువ్వు? ఎందుకు అర్ధరాత్రి తలుపు తడ్తావు?” అని గద్దించాడు.

సన్యాసి, “బాబూ, నేను సన్యాసిని, రామేశ్వరంపోతూ ఇక్కడికి వచ్చాను. ఈ రాత్రి నాకు కొంచెం తిండి పెట్టి, పడుకోనివ్వండి. ఉదయాన్నే వెళ్లిపోతాను,” అని వేడుకున్నాడు.

“ఏంటి, మా ఇంట్లో కుదరదు. పో, పో. అదుగో, ఆ ఎదురుగా ఉన్న షాహుకారు. వాడి దగ్గిరకు పో, దోవలో ఎవరైనా సన్యాసి వస్తే వాడు అన్నం పెడతాడు,” అన్నాడు రామయ్య.

యోగి అక్కడి నుంచి పోయి, సోమయ్య ఇంటి తలుపు తట్టాడు. సోమయ్య వచ్చి తలుపు తెరిచి, సన్యాసిని ఇంట్లోకి తీసుకెళ్లి, భార్యతో చెప్పి, అన్నం పెట్టించాడు. సన్యాసి భోజనం చేసిన తర్వాత, సోమయ్య ఆయనకు పక్క వేసి, ఆయన నిద్రపోయేవరకు కాపలా కూచున్నాడు.

సన్యాసి హాయిగా నిద్రపోయి, ఉదయాన లేచి వెళ్లేటప్పుడు, సోమయ్యను మరియు అతని భార్యను పిలిచి, “మీకు మూడు వరాలిస్తాను, కోరుకోండి,” అన్నాడు.

సోమయ్య, “స్వామి, నాకు నలుగురు ఇంటికి వస్తే ఉండటానికి పెద్ద ఇల్లు, బీదలకు ధర్మం చేయటానికి డబ్బు ఇవ్వండి. అదిచాలు,” అన్నాడు.

సోమయ్య భార్య, “స్వామి, నాకేమీ వద్దు, ఇతరులకు లేకుండా ధర్మం చేయటానికి నాకు బుద్ధి ఇవ్వండి,” అని రెండో వరం అడిగింది.

మూడో వరంగా, సోమయ్య, “స్వామి, మాకు ఎప్పుడూ ఇతరులకు మేలు చేయాలనే బుద్ధి ఉండేలా వరం ఇవ్వండి,” అని అడిగాడు.

సన్యాసి చిరునవ్వు నవ్వి వెళ్లిపోయాడు. మర్నాడు ఉదయం రామయ్య లేచి చూసేసరికి, అతని ఇంటి ముందు పెద్ద మేడ ఉంది. రామయ్య దబదబ పెళ్లాన్ని పిలిచి, మేడ దగ్గరకు పరుగెత్తాడు. ఆ మేడలో అతని తమ్ముడు, తమ్ముడి భార్య ఉన్నారు. రామయ్య, “ఇది ఎలా వచ్చింది?” అని తమ్ముణ్ణి అడిగాడు. సోమయ్య రాత్రి జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పాడు.

ఇక రామయ్య భార్యకు కడుపు ఉబ్బరం ఆగలేదు. ఆమె రామయ్యను గుర్రం ఎక్కించుకుని సన్యాసిని పట్టుకు రమ్మని బలవంతపెట్టింది. రామయ్యను పిలిచి తీసుకురావడానికి రాజులా చూసి, తానూ వరం పొందాలని ఆలోచించింది.

రామయ్య గుర్రం ఎక్కుకుని వెళ్లాడు. కొంతదూరం వెళ్లిన తర్వాత, సన్యాసి కనబడాడు. రామయ్య కడుపు మంటతో, “స్వామీజీ! రాత్రి మా వల్ల చాలా పొరపాటు జరిగింది. ఈ రాత్రి మా ఇంటికి రండి, మిమ్మల్ని రాజులా చూసుకుంటాము. నా భార్య కూడా మిమ్మల్ని తీసుకురమ్మంది,” అని బ్రతిమాలాడు.

“బాబూ, నేను యాత్రలలో ఉన్నాను, నేను రాలేను,” అని సన్యాసి అన్నాడు.

“అయితే, స్వామీ, కనీసం మా తమ్ముడికి ఇచ్చిన మూడు వరాలైనా నాకు కూడా ఇవ్వండి,” అన్నాడు రామయ్య.

సన్యాసి రామయ్య వదలడని భావించి, “సరే, నీకు నువ్వు కోరుకున్న మూడు వరాలు సిద్ధిస్తాయి,” అన్నాడు.

రామయ్య ఆనందంతో గుర్రాన్ని మరింత వేగంగా ఇంటి వైపు పరుగెత్తించాడు. గుర్రం నోట నురుగులు కక్కుతూ, భూమిపై పాదాలు స్పర్శించకుండా దౌడు తీస్తోంది.

ఇంతలో రామయ్యకు ఒక దుర్బుద్ధి పుట్టింది. “గుర్రం ఇంత వేగంగా పరుగెత్తుతోంది, ఎక్కడ చచ్చిపోతే ఎలా?” అనుకున్నాడు. అనుకుంటూనే గుర్రం కిందపడి చచ్చిపోయింది.

రామయ్య కూడా గుర్రంతో పాటు కిందపడ్డాడు. లేచి, దుమ్ము దులుపుకుని చచ్చిన గుర్రాన్ని చూసి విచారపడ్డాడు. అయినా, అతనికి బుద్ధి రాలేదు. “గుర్రం చనిపోయినా, ఈ జీను వదిలి పెట్టడం ఎందుకు?” అని ఆ జీను నెత్తిన పెట్టుకుని ముందుకు వెళ్లాడు.

కొంతదూరం వెళ్లాక, జీను బరువుగా అనిపించింది. పెళ్లాం మాటలు విని ఇంత దూరం వచ్చినందుకు విసుగొచ్చింది. విసుక్కుంటూ, “పాపం, నన్ను యోగి కోసం పంపి తను హాయిగా ఇంట్లో కూర్చుంది. ఈ జీను దాని నెత్తిన ఉంటే తెలిసేది నా కష్టం!” అని అనుకున్నాడు. అనుకున్న వెంటనే, ఆ జీను మాయమై, అతని భార్య నెత్తిపైకి వెళ్లింది.

రామయ్య మూడింట్లో రెండు వరాలు వృధా చేసుకుని, కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు. ఇంట్లో భార్య కూర్చుని ఉంది. ఆమె నెత్తిపై జీను ఉంది. ఆమె రామయ్యను చూసి, “ఏమిటి ఇది? ఎలా వచ్చింది నీ జీను నా నెత్తికి?” అని అడిగింది.

రామయ్యకు తాను అనుకున్న మాట జ్ఞాపకం వచ్చింది. “ఇదుగో, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు ఓర్పుగా జీను మోస్తూ ఉండు. మన దగ్గర ఇంకా ఒక వరం మిగిలి ఉంది. దీతో మనం ఏదైనా మంచివరం కోరుకుని, ధనవంతులమై హాయిగా ఉండొచ్చు,” అన్నాడు.

ఈ మాటలు విన్న ఆమె మండిపడింది. “నువ్వూ, నీ డబ్బూ పోయి గంగలో పడి వెళ్ళు. ముందు నా నెత్తిపై జీను దించు, లేదంటే బాగుండదు,” అని చెప్పింది.

పాపం, రామయ్య పెళ్లానికి భయపడి, “జీను వదిలిపోవాలి,” అని కోరుకున్నాడు. జీను వదిలి కిందపడ్డది.

చూశారా! రామయ్య దుర్బుద్ధితో ఎంత కష్టపడి తెచ్చుకున్న మూడు వరాలు ఇలా మట్టిలో కలిశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *