నారదుడు వాల్మీకికి రాముని కథను చెప్పుట

ఒక నాడు నారద మహాముని తమసా నదీ తీరాన గల వాల్మికి మహాముని ఆశ్రమానికి వచ్చాడు. వాల్మీకి ఆయనను శాస్త్రోక్తంగా పూజించి, ‘మహాత్మా ఈ యుగంలో ఈ లోకంలో సకల సద్గుణ సంపన్నుడు మహా పరాక్రముడు అయిన పురుషుడు ఎవడైనా ఉన్నాడా?.” అని అడిగాడు.

Narada narrating story of rama to valmiki

అప్పుడు వాల్మీకి కి నారదమహాముని రాముడి కథ సవిస్తరంగా చెప్పాడు. నారద మహాముని సెలవు తీసుకుని వెళ్ళి పోయే సరికి మధ్యాహ్నా స్నానానికి వేళయింది. వాల్మీకి మహాముని తన శిష్యుడైన భరద్వాజుని వెంటపెట్టుకుని తమసా నది తీరానికి వెళ్ళాడు.

అక్కడ ఆయనకు ఒక క్రౌంచ పక్షుల జంట కనిపించింది. ఆ పక్షులు పరస్పరం ప్రేమలో మైమరిచి తీయగా పాడుతూ అరణ్యంలో ఎగురుతూ ఆనందిస్తున్నాయి. నార బట్ట కట్టుకొని నీటిలోకి దిగబోతూ వాల్మీకి ఆ పక్షుల ఆనందోత్సాహం చూస్తున్నంతలోనే, ఒక బోయవాడు బాణం తో మగ పక్షిని కొట్టాడు. అది కింద పడి గిలగిలా తన్ను కున్నది. ఆడ పక్షి ఆర్తనాదాలు చేసింది. వాల్మీకి హృదయంలో ఆ పక్షి పైన జాలి, కిరాతుడి పైన ఆగ్రహం తన్నుకుని వచ్చాయి వెంటనే ఆయన బోయ వాడి తో ఇలా అన్నాడు.

మానిషాద 'ప్రతిస్టాంత్వ
మగమ శ్ళాశ్వతీ న్నమాః,
యృత్మ్కాంచ మిధునాదేక
మవధీః కామమోహతం.

“ఓరి కటికవాడా, ప్రేమోద్రేకంలో ఉన్న కౌశ్చ పక్షుల జంటలో ఒకదాన్ని చంపిన నువ్వు చిరకాలం బాగా ఉండలేవు.” అనే అభిప్రాయం అప్రయత్నంగా వాల్మీకి నోట శ్లోకం రూపంలో వెలువడింది. ఆ శ్లోకానికి నాలుగు పాదాలూ, ఒక్కొక్క పాదంలోనూ ఎనిమిదేసి అక్షరాలూ ఊన్నాయి. తన నోట ఇలా శ్లోకం వెలువడటం చూసి వాల్మీకే విస్మయం చెందాడు. ఇక ఆయన శిష్యుడైన భరద్వాజుడి ఉత్సాహానికి అంతే లేదు. అతను తన గురువు నోటి మాటలను పదేపదే పఠించి శ్లోకాన్ని కంఠస్థం చేశాడు.

తరవాత వాల్మికి స్నానం చేసి కాల కృత్యాలు తీర్చుకుని ఆశ్రమానికి వెళ్ళాడు. భరద్వాజుడు జల కలశం తీసుకుని ఆయన వెంబడే వెళ్ళాడు. ఆశ్రమంలో కూడా వాల్మీకి తన నోట వెలువడిన శ్లోకం గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. అంతలో బ్రహ్మదేవుడు ఆయనను చూడ వచ్చాడు. వాల్మీకి చప్పున లేచి బ్రహ్మ కు సాష్టాంగం చేసి అర్గ్యపాద్యాలిచ్చి స్తోత్రాలతో సన్నుతించి మౌనంగా నిలబడ్డాడు.

అప్పుడు బ్రహ్మ అ వాల్మీకిని కూచోమని వాల్మీకి నా అనుగ్రహంచేతనే నీకు కవిత్వం అబ్బింది. నీవు ఇంతకు ముందలే రాముడి కథ విన్నావుగదా. ఆ కథను మహకావ్యంగా రచించు. అది భూమి ఉన్నంత కాలమూ నిలిచి ఉంటుంది. అది ఉన్నంత కాలమూ నీవు ఉత్తమ లోకాలలో సంచరించ గలిగి ఉంటావు” అని చెప్పి అంతర్ధానమయ్యాడు.

ఈ విధంగా బ్రహ్మ యొక్క ప్రోత్సాహంతో వాల్మీకి రామాయణ కథను, తన నోట అప్రయత్నంగా వెలువడిన శ్లోకాలలాటి శ్లోకాలతో, అందరికి ఆనందం కలిగించే విధంగా రచించాడు. ఆకథనే మనంకూడా చదివి ఆనందించుదాం.

సూర్య వంశ చరిత్ర

వైవస్వతుడు నూర్యుడి కొడుకు. ఇక్ష్వాకు అనేవాడు వైవస్వతుడి కొడుకు. వైవస్వతుడు ఏడవ మనువు అయి శాశ్వత కీర్తి సంపాదించాడు, ఆయన అనంతరం ఇక్ష్వాకు సంతతివారు ఇక్ష్వాకులని, నూర్యపంశం వారనీ పిలవబడి ప్రసిద్ధి కెక్కారు. వీరిలో సగరుడుకూడా ఒకడు. ఈ సగరుడు షట్చక్రవర్తులలో ఒకడు. గంగను స్వర్గం నుంచి భూమికి తెచ్చిన భగీరథుడు ఈ సగరుడికి మనమడే.

సూర్యవంశపు రాజులు అయోధ్య నగరం రాజధానిగా కోసలదేశాన్ని పాలించారు. అయోధ్యను వైవస్వత మనువు స్వయంగా నిర్మించాడు. అది. పన్నెండు ఆమడలు పొడుగూ, మూడు ఆమడలు వెడల్పు గల చక్కని నగరం. దాని చుట్టూ ప్రాకారము లోతైన అగడ్తలూ ఉండేవి. నగరంలో లక్మి తాండవించేది.

అక్కడి ప్రజలలో శిల్చులూ, కళాకారుల పండితులూ, యుద్ధవిద్యలో ఆరితేరినవారూ వేదవేదాంగాలు తెలిసినవారూ ఉండేవారు. పట్టణంలో ఏనుగులు మేలుజాతికి చెందిన గుర్రాలు గోవులూ, ఒంటెలు గాడిదలూ దండిగా ఉండేవి. ప్రజల జీవితం సుఖమయంగా ఉండేది.

శత్రువులకు దుర్భేద్యమైన ఈ అయోధ్యను సూర్యవంశపు రాజైన దశరథుడు పరిపాలిస్తూ ఉండేవాడు. దశరథుడు ఐశ్వర్యంలో ఇంద్ర కుబేరులకు తీసిపోని వాడు మహా పరాక్రమ సంపన్నుడు.

Sumantra telling the story of Rusyasrunga to Dasaradha

దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్ర పాలుడు, సుమంత్రుడు అనే ఎనిమిది మంది దశరథుడి మంత్రులు. వశిష్ట మహా ముని ఆయనకు కులగురువు. వశిష్ఠుడు, వామదేవుడు ఆయన పురోహితులు. వేగుల వాళ్లద్వారా దేశంలో  ఏ మూల ఏమి జరుగుతుందో తెలునుకుంటూ తన మంత్రుల సహాయంతో దశరథుడు న్యాయంగా రాజ్యపాలన చేస్తూ వచ్చాడు.

దశరథుడికి ఏ లోటు లేదు కానీ సంతానం లేని లోటు ఉంది. ఒకనాడు ఆయన అశ్వమేధయాగం చేసి దేవతలను మెప్పించి, వారి అనుగ్రహంతో సంతానం పొందుతాను అని ఆలోచించి, తన మంత్రులలో అగ్రగణ్యుడైన సుమంత్రుడి ద్వారా వశిష్ట వామ దేవులను సుయజ్ఞుడు, జాబాలీ మొదలైన గురువులను ఇతర బ్రాహ్మణ శ్రేష్టులను పిలిపించి వారి సలహా అడిగాడు. అశ్వమేధ యాగం చేసే ఆలోచనను వారు మెచ్చుకున్నారు.

వారందరూ వెళ్ళినాక దశరథుడి తో సుమంత్రుడు ” మహారాజా మీరు తలపెట్టిన అశ్వమేధ యాగాన్ని జరిపించడానికి ఋష్యశృంగుని మించిన వాడు లేడు అతని వృత్తాంతం చెబుతాను వినండి” అంటూ ఈ కథ చెప్పాడు. 

Leave a Reply