తెలివైన పంపకం
ఒక రైతుకు ఇద్దరు కొడుకులు; పెద్దవాడు చురుకైనవాడు, చిన్నవాడు అమాయకుడు. చనిపోయే ముందు తండ్రి, మూడువేల గజాల చుట్టుకొలత గల భూమిని పెద్దవాడు తీసుకుని మిగతాది చిన్నవాడికి ఇవ్వాలని చెబుతాడు. పొలం మొత్తం చుట్టుకొలతే మూడువేల గజాలు కావడంతో, పెద్దవాడు పొలమంతా తానే తీసుకుంటానంటాడు. కంగారుపడ్డ చిన్నవాడు న్యాయాధికారిని ఆశ్రయిస్తాడు. తెలివైన న్యాయాధికారి పొలాన్ని అడ్డంగా, నిలువుగా నాలుగు భాగాలుగా విభజించి ఎదురెదురు భాగాలను ఇద్దరికీ పంచడంతో, ఇద్దరి వాటాలకూ సమానంగా మూడేసి వేల గజాల చుట్టుకొలత వస్తుంది.
Continue reading »